తేదీ : 9-06-2017 మెగాపవర్ స్టార్ న్యూ మూవీ అప్డేటెడ్ న్యూస్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న మెగా అభిమానులకు లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న రామ్ చరణ్ కొత్త సినిమాకి "రంగస్థలం" అనే టైటిల్ ను ఖరారు చేసారు అంతే కాదు టైటిల్ కింద 1985 అని కూడా పెట్టారు. అంతే కాదు ఎప్పుడు పదేళ్ల తరువాత మెగా స్టార్ చిరంజీవి గారు నటించిన తన చిత్రంలో అభిమానులకు ఏ మాత్రం తేడా రాకుండా తన కాస్ట్యూమ్స్ తో సినిమాకి ప్లస్ అయ్యేలా చూసింది సుస్మిత అయితే ఆ క్రేజ్ తోనే ఇప్పుడు మెగా పవర్ స్టార్ సినిమాకి ఆమెనే కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ఎంపిక చేశారట. నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమా కామెర్సీయల్ గా కూడా "బ్లాక్ బస్టర్" అయ్యే విధంగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారట అలాగే march 20 న ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది.
ఎప్పుడు కూడా తన వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటున్న రాంచరణ్ ఈ సారి పల్లెటూరి ప్రేమ కథతో రానున్నాడు అని చర్చల్లో నిలుస్తున్న ఈ మూవీలో చెర్రీ లుక్ చాలా కొత్తగా ఉంటుందట.
Comments